| చిరంజీవి తన రాజకీయ ప్రవేశం గురించి ప్రత్యక్షంగా ఎక్కడా వ్యాఖ్యానించకపోయినా, రాష్ట్రంలో ప్రతిరోజు ఎవరోఒకరు ఈ విషయంపై గళం విప్పుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు చిరు రాజకీయ ప్రవేశంపై వారి అభిప్రాయాలను చెప్పడం ద్వారా ఈ విషయాన్ని తాజాగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హాస్యనటుడు బ్రహ్మానందం సైతం చిరంజీవి రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తన మద్దతు తప్పకుండా ఆయనకే అని ప్రకటించేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన బ్రహ్మానందం విలేకరులతో మాట్లాడుతూ ఎవరెవరు ఏ రంగంలోకి వస్తారనేది దైవ సంకల్పమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లోకి రావడం జరిగితే తాను ఆయనకే మద్దతిస్తానని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ తనను చూడగానే ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలాంటి ముఖాన్ని ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. |
Thursday, August 21, 2008
చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే మద్దతు: బ్రహ్మానందం. 10 లక్శల రాల్య్ Aug 26
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment